Sabari: ఓటీటీలో వరలక్ష్మి శరత్ కుమార్ 'శబరి'

Sabari Movie Update

  • మే 3వ తేదీన విడుదలైన 'శబరి'
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సినిమా 
  • టైటిల్ రోల్ పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ 
  • ఈ నెల 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 


తెలుగు .. తమిళ భాషల్లో వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. నాయిక ప్రధానమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన సినిమానే 'శబరి'. మహేంద్రనాథ్ నిర్మాణంలో .. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మే 3వ తేదీన థియేటర్లకు వచ్చింది.

గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సినిమాను 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాలో, గణేశ్ వెంకట్రామన్ .. మైమ్ గోపీ .. శశాంక్ .. బేబీ కృతిక ముఖ్యమైన పాత్రలను పోషించారు.

కథ విషయానికి వస్తే, సంజన (వరలక్ష్మి శరత్ కుమార్) అరవింద్ (గణేశ్ వెంకట్రామన్)ను గాఢంగా ప్రేమిస్తుంది. అర్ధాంగిగా అతని జీవితంలోకి అడుగుపెడుతుంది. అయితే ఒకానొక సందర్భంలో అతని నిజస్వరూపం గురించి తెలుసుకుని, తన కూతురు 'రియా'ను తీసుకుని ముంబై వెళ్లిపోతుంది. ఆ తల్లీకూతుళ్లను వెదుక్కుంటూ అక్కడికి సూర్య (మైమ్ గోపీ) వస్తాడు. సూర్య ఎవరు? సంజనతో అతనికి గల సంబంధం ఏమిటి? ప్రమాదంలో ఉన్న తన కూతురిని ఆమె ఎలా కాపాడుకోగలుగుతుంది? అనేది కథ.

Sabari
Varalakshmi Sharath Kumar
Ganesh Venkatraman
Mime Gopi
  • Loading...

More Telugu News