Naveen Chandra: అమెజాన్ ప్రైమ్‌కి మరో సస్పెన్స్ థ్రిల్లర్!

Snake And Laddeers Series

  • తమిళంలో రూపొందిన 'స్నేక్ అండ్ ల్యాడర్స్'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కంటెంట్  
  • ఈ నెల 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్  


అమెజాన్ ప్రైమ్ నుంచి ప్రేక్షకులను పలకరించడానికి మరో వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'స్నేక్ అండ్ ల్యాడర్స్'. తమిళంలో రూపొందిన సిరీస్ ఇది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సిరీస్‌ను నిర్మించడం విశేషం. 

ఈ సిరీస్‌కి భరత్, మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా ఆల్కెమిస్ దర్శకులుగా వ్యవహరించారు. హీరో నవీన్‌చంద్రతో పాటు, ముత్తుకుమార్, నందా, మనోజ్ భారతీరాజా ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. 

నలుగురు పిల్లల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వారికి ఒక ప్రమాదం గురించి తెలుస్తుంది. అయితే వారు ఆ ప్రమాదం గురించి చెప్పకుండా దాచడం వలన మరింత ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.  దాంతో ఒక వైపున పోలీసులు, మరో వైపున దొంగలు వారిని వెంటాడుతుంటారు. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఎలా తప్పించుకుంటారు? అనేదే కథ.

Naveen Chandra
Muthu Kumar
Nanda
  • Loading...

More Telugu News