Suhas: ఈ వారం ఓటీటీకి వస్తున్న తెలుగు సినిమాలివే!

This week OTT movies

  • ఈ నెల 10వ తేదీన ఆహాలో 'గొర్రె పురాణం'
  • సుహాస్ హీరోగా చేసిన సినిమా ఇది 
  • 10వ తేదీన ఈటీవీ విన్‌లో 'పైలం పిలగా'
  • అదే రోజున పలకరించనున్న 'తత్వ'
  • 11న 'ఆహా' తెరపైకి 'వెయ్ దరువెయ్' 


దసరా పండుగ కావడంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లన్నీ ఈ వారం కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లైన 'ఆహా' .. 'ఈటీవీ విన్'లో చిన్న సినిమాల సందడి మొదలవుతోంది. ఆ జాబితాలో ముందుగా చెప్పుకోవలసిన సినిమాగా 'గొర్రె పురాణం' కనిపిస్తోంది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాకి పురాణం బాబీ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 21న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.ఇక ఈ నెల 10వ తేదీనే 'ఈటీవీ విన్' రెండు తెలుగు సినిమాలను స్ట్రీమింగ్ చేయనుంది. ఒకటి 'తత్వ' అయితే, మరొకటి 'పైలం పిలగా'. హిమ దాసరి - ఉస్మాన్ ఘని ప్రధాన పాత్రలను పోషించిన 'తత్వ' క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన వెబ్ ఫిల్మ్. రిత్విక్ దర్శకుడిగా వ్యవహరించాడు. అరిఫ్ అనే యువకుడు ఒక నేరస్థుడిగా పోలీసులకు పట్టుబడతాడు. ఆ సంఘటనకు ముందు ఏం జరిగిందనేది కథ. ఇక 'పైలం పిలగా' విషయానికి వస్తే, ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన సినిమా ఇది. సెప్టెంబర్ 20వ తేదీన థియేటర్లకు వచ్చింది. సాయితేజ - పావని కరణం జంటగా నటించారు. దుబాయ్ వెళ్లాలనుకున్న హీరో, తనకున్న కొద్దిపాటి స్థలాన్ని అమ్మేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎదురయ్యే అనుభవాలే కథ. ఇక 'ఆహా'లో ఈ నెల 11వ తేదీన 'వెయ్ దరువెయ్' స్ట్రీమింగ్ కానుంది. సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన ఈ సినిమాకి, నవీన్‌రెడ్డి దర్శకత్వం వహించాడు.

  • Loading...

More Telugu News