Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు షాయాజీ షిండే

Actor Shayaji Shinde met Pawan Kalyan

  • పవన్ ను కలవాలనుందని ఇటీవల వ్యాఖ్యానించిన షిండే
  • ఓ సూచన చేస్తానని వెల్లడి
  • ఇవాళ పవన్ అపాయింట్ మెంట్ లభించిన వైనం

ఇటీవల టాలీవుడ్ నటుడు షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందని పవన్ కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు పవన్ అపాయింట్ మెంట్ లభించింది. 

ఇవాళ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. తన ప్రతిపాదనను పవన్ కు వివరించారు. తన ఆలోచనలను షిండే లిఖితపూర్వకంగా పవన్ కు అందజేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ, షిండే సూచనలను తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు. 

Pawan Kalyan
Shayaji Shinde
Janasena
Andhra Pradesh
Tollywood
  • Loading...

More Telugu News