AP Govt: ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం... తిరుమలలో మైక్రోబయాలజీ ల్యాబ్

AP Govt inked a deal with FSSAI

  • గత ఐదేళ్లలో ఆహార భద్రత, ప్రమాణాల్లో పతనమైన ఏపీ ర్యాంకు
  • దిద్దుబాటు చర్యలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం
  • నేడు ఎఫ్ఎస్ఎస్ఏఐ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఒప్పందం

ఏపీ ప్రభుత్వం ఆహార భద్రత తనిఖీల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

ఇందులో భాగంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్రంలో పలు చోట్ల ప్రయోగశాలలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. తిరుమల, విశాఖపట్నం, కర్నూలులో మైక్రోబయాలజీ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారు. 

రాష్ట్రంలో ఐదు ప్రాథమిక ప్రయోగశాలలు, 15 మొబైల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి ల్యాబ్ లో రూ.21 కోట్లతో మౌలిక వసతుల ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఒప్పందం కుదిరింది. గత ఐదేళ్లలో ఆహార భద్రత, ప్రమాణాల్లో రాష్ట్ర ర్యాంకు బాగా పతనమైంది.

More Telugu News