Garuda Seva: జనసంద్రంలా తిరుమల... గరుడ సేవకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

Devotees rushed to watch Srivari Garuda Seva in Tirumala
  • అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • నేడు ఎంతో విశిష్టమైన గరుడ సేవ
  • మాడవీధుల్లోని 231 గ్యాలరీల్లో క్రిక్కిరిసిన జనం
  • తిరుమల అంతటా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన టీటీడీ
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఎంతో విశిష్టమైన గరుడ సేవ జరుగుతోంది. తిరుమల వెంకన్న మలయప్పస్వామి రూపంలో గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా వీక్షించి, తరించేందుకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. దాంతో తిరుమాడ వీధులు ఇసుకేస్తే రాలనంతగా భక్త జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. మాడవీధుల్లో ఏర్పాటు చేసిన 231 గ్యాలరీలు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. 

గరుడ వాహన సేవను భక్తులందరూ వీక్షించేందుకు వీలుగా ,టీటీడీ తిరుమల అంతటా భారీ ఎలక్ట్రానిక్ తెరలను ఏర్పాటు చేసింది. గోవింద నామ స్మరణతో తిరుమల కొండ మార్మోగుతోంది.
Garuda Seva
Brahmotsavams
Tirumala
TTD

More Telugu News