Pushpa 2: పుష్ప- 2 ది రూల్‌ ఫస్టాఫ్‌ లాక్‌... రూ.1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తి!

Pushpa 2 The Rule First Off Lock 1000 Crores Prerelease Business Complete

  • కీలక అప్‌డేట్‌ను వదిలిన మేకర్స్‌
  • డిసెంబర్‌ 6నే విడుదల... మరో సారి కన్‌ఫర్మ్‌ చేసిన నిర్మాతలు 
  • ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసిన పుష్ప-2!

పుష్ప-2: ది రూల్‌... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రమిది. పుష్ప: ది రైజ్‌ సాధించిన ఘనవిజయమే అందుకు కారణం. పుష్పతో అందరి దృష్టిని ఆకర్షించిన సుకుమార్‌, అల్లు అర్జున్‌ పుష్ప-2 చిత్రం కోసం గత రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా జరుపుకుంటోంది. 

కాకినాడ, యానాంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా,  మేకర్స్‌ ఈ చిత్రం నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్‌ ఎడిటింగ్‌తో పాటు అన్నిపనులు పూర్తిచేసుకుని లాక్‌ చేశారని ఓ పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు ఈ చిత్రం ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయని విధంగా ఉంటుందని సమాచారం. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. 

డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు ఈ చిత్రం రూ.1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తిచేసుకుని సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసిందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ను ప్రారంభించబోతున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News