Supriya: నాంపల్లి కోర్టులో సుప్రియ ఇచ్చిన వాంగ్మూలం ఇదే!

Supriya statement to court

  • కొండా సురేఖపై నాగార్జున క్రిమినల్ కేసు
  • ఈరోజు నాగార్జున, సుప్రియల వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు
  • తదుపరి విచారణను 10వ తేదీకి వేయిదా వేసిన కోర్టు

సినీ నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సురేఖపై నాంపల్లి కోర్టులో నాగార్జున క్రిమినల్ దావా వేశారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం నాగార్జున, సుప్రియ వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. 

కోర్టుకు సుప్రియ ఏమని వాంగ్మూలం ఇచ్చారంటే...

"బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల సమంత, నాగచైతన్య విడాకులు జరిగాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ వద్దకు సమంతను పంపించాలని అడిగితే.. దానికి సమంత ఒప్పుకోలేదని... అందుకే విడాకులు తీసుకుందని మంత్రి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో మా కుటుంబం మొత్తం షాక్ కు గురైంది. మంత్రి వ్యాఖ్యలు తాను కొన్ని టీవీ ఛానల్స్ లో చూశా. మరుసటి రోజు వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి. మంత్రి వ్యాఖ్యల కారణంగా మా కుటుంబం ఎంతో మనోవేదనకు గురైంది" అని సుప్రియ పేర్కొన్నారు.

మరోవైపు నాగార్జున, సుప్రియల వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు... తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు మరో సాక్షి వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయనుంది.

  • Loading...

More Telugu News