Mandali Buddaprasad: జగన్ పై బుద్దా వెంకన్న ఫైర్

budda venkanna fires on jagan

  • ప్రజలు అల్లాడుతుంటే జగన్ ఏసీ గదిలో కూర్చున్నారన్న బుద్దా వెంకన్న
  • వరద బాధితులను చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని వ్యాఖ్య
  • ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ నీతులు చెపుతున్నాడని విమర్శ

ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే విజయవాడ ప్రజలు వరదల వల్ల బయటపడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విపత్తు సమయంలో చంద్రబాబు ప్రతి ఇంటికి మంచినీరు, ఆహారం అందించారని చెప్పారు. చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని అన్నారు. 

ప్రభుత్వానికి వస్తున్న ప్రజల ఆదరాభిమానాలను చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారంటున్నారని దుయ్యబట్టారు. వరదల్లో అవినీతి జరిగిందనే విషయంపై బహిరంగ చర్చకు రావాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. 

వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే... ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. ఏనాడైనా బురదలో తిరిగి ప్రజలను కలిసిన చరిత్ర జగన్ కి ఉందా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ కూడా నీతులు చెపుతున్నారని విమర్శించారు. వైసీపీని ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారని... పద్ధతి మార్చుకోకుండా కుట్రలను కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.

Mandali Buddaprasad
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News