Chandrababu: రాజస్థాన్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన చంద్రబాబు

Chandrababu telephones Rajasthan CM

  • రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదానికి గురైన న్యాయవాదులు ప్రయాణిస్తున్న బస్సు
  • సీఎం భజన్ లాల్ శర్మకు చంద్రబాబు ఫోన్
  • ప్రమాద బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరిన చంద్రబాబు

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం ప్రయాణిస్తున్న బస్సు రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటన గురించి భజన్ లాల్ తో చంద్రబాబు మాట్లాడారు. ప్రమాద బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. వారంతా తిరిగి ఇంటికి రావడానికి సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు. 

మరోవైపు, ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Chandrababu
Telugudesam
Rajasthan CM
  • Loading...

More Telugu News