Vijayasai Reddy: ఇదీ చంద్రబాబు మార్క్ పాలన: విజయసాయిరెడ్డి

Chandrababu Govt not paying salaries says Vijayasai Reddy
  • కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదన్న విజయసాయిరెడ్డి
  • రూ. 400 కోట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్న సాయిరెడ్డి
  • జీవో విడుదలైనా.. నిధులు మాత్రం హుళక్కి అయ్యాయని విమర్శ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. రూ. 400 కోట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని... ఈ విషయాన్ని కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో రాసిందని అన్నారు. టీవీల్లో రోజంతా బ్రేకింగ్ న్యూస్ లు నడిచాయని చెప్పారు. 

జీవో విడుదలైనా... నిధులు మాత్రం హుళక్కి అయ్యాయని విజయసాయి దుయ్యబట్టారు. చంద్రబాబు కుతంత్రాలు అలాగే ఉంటాయని విమర్శించారు. సమగ్ర శిక్షణలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు లేవని అన్నారు. ప్రాణాలు రక్షించే 108, 104లో పని చేసే 6,500 మందికి జులై నుంచి నయా పైసా విదల్చలేదని చెప్పారు. వీరే కాదు అనేక డిపార్టుమెంట్లలో వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో దసరా, దీపావళి పండుగలు వస్తున్నా... చిమ్మ చీకట్లు తొలగిపోలేదని అన్నారు. 'ఇదీ చంద్రబాబు మార్కు పాలన... దీన్ని మార్పు అనాలంట' అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News