IPL 2025: వేలానికి ముందు ఐపీఎల్ కొత్త రిటెన్షన్ నిబంధనలు.. క్యాప్డ్ ప్లేయర్లకు షాక్!

IPL Announce New Retention Rule Ahead Of Mega Auction

  • వేలానికి ముందు ఐపీఎల్ కొత్త రిటెన్షన్ నిబంధనలు 
  • ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే వెసులుబాటు
  • ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని క్యాప్డ్ ప్లేయర్లను అన్‌క్యాప్డ్‌గా పరిగణించేలా కొత్త రూల్
  • ప్రయోజనం పొందనున్న పలు జట్లు

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిటెన్షన్ నిబంధనలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల ప్రకటించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ ద్వారా లేదంటే రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు ద్వారా రిటైన్ చేసుకోవచ్చు. జట్లు తమ ఆటగాళ్లను విడుదల చేసుకోవచ్చు. వేలంలో ఆర్టీఎం కార్డులను ఉపయోగించుకోవచ్చని దీనర్థం. 

అయితే, ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి. ఈ రిటైన్ గరిష్ఠంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు (స్వదేశీ, విదేశీ), గరిష్ఠంగా ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు మాత్రమే పరిమితం. అయితే, ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. పునరుద్ధరించిన (రీ ఇన్‌స్టాట్) క్యాప్డ్‌ ఇండియన్ ఆటగాడు గత ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడకపోయినా, బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉండకపోయినా అతడిని అన్‌క్యాప్డ్‌గా పరిగణించేందుకు ఈ కొత్త నిబంధన అనుమతిస్తుంది. దీనివల్ల జట్లు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News