Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా?

Is Yahya Sinwar Alive What Israel Media Says

  • అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యహ్యా సిన్వర్
  • ఈ ఏడాది ఆగస్టులో హమాస్ చీఫ్‌గా నియమాకం
  • గత నెల 21న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందినట్టు అనుమానం
  • ఆయన బతికే ఉన్నారంటూ ఖతర్ దౌత్యవేత్త పోస్టు

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ హతమవలేదా? అతడింకా బతికే ఉన్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ అధినేత అయిన యహ్యా సిన్వర్ సజీవంగానే ఉన్నాడని ఖతర్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అంతేకాదు, ఆయన తనకు రక్షణ కవచంగా ఇజ్రాయెల్ బందీలను ఉంచుకున్నట్టు ఖతర్ అధికారులు గతంలో పేర్కొన్నారని కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. దీనిని బట్టి ఖతర్‌తో సిన్వర్ రహస్య సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్టు తెలుస్తోందని మీడియా పేర్కొంది.

అక్టోబర్ 7 దాడుల సూత్రధారి అయిన సిన్వర్ ఈ ఏడాది ఆగస్టులో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెల 21న హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో సిన్వర్ మృతి చెంది ఉంటాడని భావించారు. అయితే, ఈ విషయంలో హమాస్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇప్పుడు ఖతర్ దౌత్యవేత్త చేసిన పోస్టుతో అతడు బతికే ఉన్నాడని ఇజ్రాయెల్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News