Ka: 'క' సినిమా నుంచి 'మాస్ జాతర' లిరికల్ సాంగ్ రిలీజ్

Mass Jatara lyrical song release from the movie Ka

  • విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'క'
  • నాలుగు భాషల్లో 'క' విడుదల 
  • మాస్‌ జాతర పాటలో కిరణ్‌ అబ్బవరం హుషారైన డ్యాన్స్‌



హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా 'క'. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాత. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌'క' సినిమాను రూపొందిస్తున్నారు. 

ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఈ రోజు 'క' సినిమా నుంచి 'మాస్ జాతర' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను సామ్ సీఎస్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. సనాపాటి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ అందించగా... దివాకర్, సామ్ సీఎస్, అభిషేక్ ఏఆర్ పాడారు. "ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు..ఆడు ఆడు ఆడు ఆడు ఆడు అమ్మోరే మురిసేలా ఆడు.. ఆడు ఆడు ఆడు ఆడు ఊరు వాడ అదిరేలా ఆడు.." అంటూ పూనకాలు తెప్పించేలా సాగుతుందీ పాట. పొలాకి విజయ్ కొరియోగ్రఫీ చేశారు. 

'మాస్ జాతర ' పాటలో హీరో కిరణ్ అబ్బవరం మాస్ ఎనర్జిటిక్స్ కనిపిస్తున్నాయి. 'క' సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

Ka
Kiran abbavaram
Mass jatara song
Tollywood
KA Mass Jathara

More Telugu News