Pawan Kalyan: మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan tweets again on MGR

  • పవన్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం
  • ఇటీవల ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్
  • హఠాత్తుగా ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందో అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్
  • తాజా ట్వీట్ తో కౌంటర్ ఇచ్చిన పవన్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డూ కల్తీ, సనాతన ధర్మం అంశంలో ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

ఇటీవల పవన్ కల్యాణ్ ఎంజీఆర్, అన్నాడీఎంకే గురించి ట్వీట్ చేయగా.... ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయా అంటూ ప్రకాశ్ రాజ్ విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ క్రమంలో, పవన్ కల్యాణ్ మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేశారు. 

పురచ్చి తలైవర్, శ్రీ ఎంజీఆర్ నుంచి పాఠాలు నేర్చుకున్నానని పవన్ వెల్లడించారు. ఈ మేరకు తాను గతంలో ఎంజీఆర్ గురించి చేసిన కామెంట్ల తాలూకు వీడియోలను పంచుకున్నారు. 

ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందో అని ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే పవన్ తాజా ట్వీట్ చేసినట్టు నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనే ఎంజీఆర్ గురించి మాట్లాడానని చెప్పడమే పవన్ ఉద్దేశమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan
MGR
Tweet
Prakash Raj

More Telugu News