Singham Again: అజయ్ దేవగణ్ 'సింగం అగైన్' ట్రైలర్ విడుదల

Singham Again trailer out now

  • అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టి కాంబోలో సింగం అగైన్
  • సింగం సిరీస్ లో మరో సీక్వెల్
  • నవంబరు 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ 

అజయ్ దేవగణ్, కరీనా కపూర్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టయినర్ మూవీ సింగం అగైన్. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. 

అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టి కలయికలో ఇప్పటికే సింగం రెండు పార్టులు బాక్సాఫీసు వద్ద గణనీయమైన విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ఆ పరంపరలోనే సింగం అగైన్ వస్తుండడంతో, భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి సీజన్ లో నవంబరు 1న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

సింగం అగైన్ లో అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపిక పదుకొనే, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్ వంటి అగ్రతారలు కూడా ఉండడంతో యాక్షన్ హంగామా మామూలుగా ఉండదని అర్థమవుతోంది. ఈ చిత్రానికి అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టి, జ్యోతి దేశ్ పాండే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Singham Again
Trailer
Ajay Devgan
Rohit Shetty
Bollywood

More Telugu News