Sunil Kumar: అభియోగాలపై వివరణ ఇవ్వండి... సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను ఆదేశించిన ప్రభుత్వం

AP Govt issues orders to CID Former Chief Sunil Kumar

  • సోషల్ మీడియాలో రఘురామపై సునీల్ కుమార్ వ్యాఖ్యలు
  • నగరంపాలెం పీఎస్ లో రఘురామ ఫిర్యాదు
  • 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ సునీల్ కుమార్ కు ఉత్తర్వులు

టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై  ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నగరంపాలెం పీఎస్ లో దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జీఏడీ రాజకీయ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.1695 తీసుకువచ్చింది. అభియోగాలపై వివరణ ఇచ్చే క్రమంలో, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సునీల్ కుమార్ తన వివరణను లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Sunil Kumar
CID
Raghu Rama Krishna Raju
TDP
YSRCP
  • Loading...

More Telugu News