Deepinder Goyal: డెలివ‌రీ బాయ్‌గా వెళ్లిన జొమాటో సీఈఓకు ఊహించ‌ని షాక్‌..!

Shocking Experience to Zomato CEO Deepinder Goyal while Collecting Order

  • డెలివ‌రీ బాయ్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జొమాటో సీఈఓ స‌రికొత్త ప్ర‌యోగం
  • డెలివ‌రీ బాయ్ అవ‌తారం ఎత్తిన దీపింద‌ర్ గోయ‌ల్
  • ఓ మాల్‌లోకి ఆర్డ‌ర్ తీసుకునేందుకు వెళ్ల‌గా లిఫ్ట్ ఎక్క‌కుండా అడ్డుకున్న సిబ్బంది

విధుల్లో ఉండ‌గా డెలివ‌రీ బాయ్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు జొమాటో సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డ‌ర్‌ను క‌లెక్ట్ చేసుకునే క్ర‌మంలో ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. 

అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది దీపింద‌ర్‌ను లిఫ్ట్‌లోకి ఎక్క‌కుండా అడ్డుకున్నారు. దాంతో చేసేదేమిలేక మెట్ల మార్గంలోనే మూడో అంత‌స్తుకు వెళ్లి ఆర్డ‌ర్ తీసుకున్న‌ట్లు త‌న‌కు ఎదురైన షాకింగ్‌ అనుభ‌వాన్ని తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆయ‌న‌ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. 

ఈ సంఘ‌ట‌న‌తో డెలివ‌రీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో క‌లిసి జొమాటో మ‌రింత సాన్నిహిత్యంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విషయం త‌న‌కు బోధ‌ప‌డింద‌ని అన్నారు. దీనిపై మీరేమ‌నుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియ‌జేయం‌డంటూ నెటిజ‌న్లను కోరారు.

  • Loading...

More Telugu News