Committee Kurrollu: నిహారిక 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి అవార్డు

Committee Kurrollu wins award

  • నిహారిక సమర్పణలో వచ్చిన కమిటీ కుర్రోళ్లు చిత్రం
  • 11 మంది కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్లతో తెరకెక్కిన సినిమా
  • ఆగస్టు 9న విడుదల

మెగా డాటర్ కొణిదెల నిహారిక సమర్పణలో వచ్చిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. చిన్న చిత్రమే అయినా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, అవార్డులను సైతం కొల్లగొడుతోంది. తాజాగా ఈ చిత్రానికి మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డు లభించింది. దాదాసాహెబ్ ఫాల్కే ఎంఎస్కే ట్రస్ట్ అవార్డుల కార్యక్రమంలో కమిటీ కుర్రోళ్లు చిత్రానికి అవార్డు అందించారు.

11 మంది కొత్త హీరోలతో, నలుగురు హీరోయిన్లతో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్ పీ, శ్రీరాధా దామోదర స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Committee Kurrollu
Award
Niharika
Tollywood
  • Loading...

More Telugu News