Team India: టీ20 వరల్డ్ కప్: పాక్ ను కట్టడి చేసిన భారత్... రాణించిన తెలుగమ్మాయి అరుంధతి

Team India eves restricts Pakistan in T20 World Cup

  • దుబాయ్ లో భారత్ × పాకిస్థాన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ అమ్మాయిలు
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు
  • 3 వికెట్లు తీసిన అరుంధతి రెడ్డి

యూఏఈలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక.

టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత అమ్మాయిలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి దాయాదిని సమర్థంగా కట్టడి చేశారు. దాంతో, పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి కేవలం 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. అరుంధతి రెడ్డి పాక్ మహిళల జట్టు మిడిలార్డర్ ను దెబ్బతీసింది. టీమిండియా బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, రేణుకా సింగ్ 1, దీప్తి శర్మ 1, ఆశా శోభన 1 వికెట్ తీశారు. పాక్ జట్టులో నిదా దార్ చేసిన 28 పరుగులే అత్యధికం. ఓపెనర్ మునీబా అలీ 17, కెప్టెన్ ఫాతిమా సనా 13, సయీదా అరూబ్ షా 14 పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News