TTD: శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న వార్తలు అవాస్తవం: టీటీడీ

TTD clarifies on false propaganda

  • స్వామివారి అన్నప్రసాదంలో జెర్రి పడిందంటూ ప్రచారం
  • ఓ ప్రకటనలో ఖండించిన టీటీడీ
  • ఇది కావాలనే చేస్తున్న ప్రచారం అని స్పష్టీకరణ

వెంకటేశ్వరస్వామి అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. మాధవ నిలయంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందని ఓ భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరం అని స్పష్టం చేసింది. 

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది భక్తులకు వడ్డించడానికి టీటీడీ సిబ్బంది పెద్ద మొత్తంలో అన్నప్రసాదాలను ఎప్పటికప్పుడు తయారు చేస్తారని, అంత వేడిలో కూడా ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రి ఉందని ఆ భక్తుడు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోందని టీటీడీ తన ప్రకటనలో పేర్కొంది. 

ఒకవేళ పెరుగన్నం కలపాలన్నా... ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియదిప్పి, ఆ తర్వాత పెరుగు కలుపుతారని వివరించింది. అలాంటి సమయంలో కూడా జెర్రి రూపు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉందనడం పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని భావించాల్సి వస్తోందని టీటీడీ పేర్కొంది. 

దయచేసి భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News