: పాదగయ క్షేత్రంలో సీబీఐ జేడీ పూజలు


అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తాడని పేరున్న సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణకు దైవచింతన ఎక్కువ. ఆయనకు ఎప్పుడు తీరిక దొరికినా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తన భక్తిప్రపత్తులను చాటుకుంటారు. తాజాగా ఈ ఐపీఎస్ అధికారి నేడు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలం పనిచేయడం మరువలేని అనుభవమని పేర్కొన్నారు. ఏడేళ్ళు ఇక్కడ పనిచేసినా ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదని చెప్పారు. ఇక తన స్వంత క్యాడర్ మహారాష్ట్ర పోలీసు విభాగానికి బదిలీ కావడం వెనుక ఎలాంటి మతలబు లేదంటూ, అది సాధారణ బదిలీయేనని వివరించారు. ఇక పలు కేసుల పరిశోధనల ద్వారా ఎన్నో కొత్త విషయాలు అవగతం చేసుకున్నానని తెలిపారు.

'మానవసేవే మాధవసేవ' అని మనసా వాచా కర్మణాః నమ్మిన ఈ ఐపీఎస్ అధికారి పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనడమే కాదు, తనవంతు సహాయసహకారాలూ అందిస్తారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News