Nagarjuna: అదృష్టం కొద్దీ ఇండస్ట్రీ మొత్తం మాకు మద్దతుగా నిలిచింది: నాగార్జున

nagarjuna Key Comments movie Industry

  • మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా పిటిషన్ వెనక్కు తీసుకోనని పేర్కొన్న నాగార్జున
  • కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో తాను సింహాన్ని అంటూ నాగార్జున వ్యాఖ్య
  • సినీ ఇండస్ట్రీ మొత్తం అండగా నిలబడేందుకు ముందుకు వచ్చిందన్న నాగార్జున

ప్రముఖ సినీ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపాయి. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెబుతూ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ విషయంలో సీరియస్‌గా ఉన్న నాగార్జున మాత్రం కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరగలేదు. సోమవారం నాగార్జున పిటిషన్ పై విచారణ జరగనుంది.

ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ తన కుటుంబానికి క్షమాపణలు చెప్పినా పరువునష్టం దావా కేసును వెనక్కు తీసుకోనని స్పష్టం చేశారు. వంద కోట్లకు పరువునష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నానని పేర్కొన్నారు. కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో తాను సింహాన్ని అని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు సినీ ఇండస్ట్రీ మొత్తం తమకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చిందని, ఇది తమ నాన్నగారి ఆశీర్వాదం అని నాగార్జున వ్యాఖ్యానించాడు.

Nagarjuna
Movie News
Konda Surekha
  • Loading...

More Telugu News