Haryana: ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Haryana Assembly Elections Polling Begins


హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలుండగా 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 కోట్ల మందికిపైగా ఓటర్ల కోసం 20,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

హర్యానాలో బీజేపీ పదేళ్లుగా పాతుకుపోయింది. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుండగా, ఈసారి కాషాయ పార్టీకి విజయం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగా ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కుల సమీకరణాలు ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మరో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News