KA Paul: కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్... హైడ్రాకు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG HC issues notices to KA Paul

  • జీవో 99పై స్టే విధించాలని, కూల్చివేతలు ఆపాలని పాల్ పిటిషన్
  • ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమన్న కోర్టు
  • కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు

హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 99పై స్టే విధించాలని, హైడ్రా కూల్చివేతలను తక్షణమే ఆపివేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కార్యాచరణను చేపట్టాలని వాదనల సందర్భంగా కేఏ పాల్ కోరారు. అక్రమ కట్టడాలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని కోర్టును కోరారు.

అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News