Swag: శ్వాగ్‌ చిత్రం పబ్లిక్‌ టాక్‌ ఎలా వుందో తెలుసా?

Do you know how Swags film became a public talk

  • ఫస్ట్‌హాఫ్‌ ఓకే... సెకండాఫ్‌ నెమ్మదించిందన్న ఆడియన్స్
  • ఆకట్టుకోని ట్విస్ట్‌లు 
  • ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌ మిస్సింగ్‌

విభిన్న కథలతో, వైవిధ్యమైన సినిమాలు చేసే కథానాయకుడు శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం శ్వాగ్‌. హసిత్‌ గోలి దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌లు కాస్త కొత్తగా కనిపించడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ట్రైలర్‌లో అక్కడక్కడా బోల్డ్‌ డైలాగులు కూడా జోడించడం యూత్‌ను ఆకర్షించింది. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం గురించి నెటిజన్లు, పబ్లిక్‌ ఏమనుకుంటున్నారో చూద్దాం...!

దర్శకుడు హసిత్ గోలి కొత్త బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్‌ కథను తయారుచేసుకున్నాడు. అయితే కథకు తగ్గ ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించలేకపోయాడు. ముఖ్యంగా స్టోరీ లైన్‌ ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజ్‌ చేసే విధంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఓ కన్‌ఫ్యూజన్‌ కామెడీ స్టోరీని కన్విన్సింగ్‌ చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడని ఆడియన్స్‌ అంటున్నారు. ఫస్ట్‌హాఫ్‌ సరదాగా సాగిపోయినా ద్వితీయార్థం కథ సాగతీతగా ఉండడంతో నెమ్మదించింది. స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌లు ఏమీ లేకపోవడంతో ట్విస్ట్‌లతో అలరించాలని భావించిన దర్శకుడి ప్రయత్నం అంతగా ఫలించలేదు. 

హీరో  శ్రీవిష్ణు ఈ చిత్రంలో నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ప్రతి పాత్రలో ఆయన రాణించాడు. ఒక నటుడిగా శ్రీవిష్ణుకు ఈ సినిమా ద్వారా మంచి మార్కులే పడతాయి. సినిమా నేపథ్యానికి తగిన విధంగా రచయితగా హసిత్‌ గోలి తన ప్రతిభను చూపి వుంటే శ్రీవిష్ణు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికేది అని నెటిజన్స్‌ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

ట్రైలర్‌తో రేకెత్తించిన ఉత్కంఠ సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్‌ డిజప్పాయింట్‌ అవుతున్నారని సోషల్‌ మీడియాలో రివ్యూలను చెబుతున్నాయి. కాగా కొత్తదనం, డిఫరెంట్‌ సినిమాలను ఆశించే ప్రేక్షకులను శ్వాగ్‌ కొంతమేరకు సంతృప్తిపరిచే అవకాశం ఉందని సినిమా చూసిన ఆడియన్స్‌లో కొంత మంది ట్విట్స్‌ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News