KTR: రుణ‌మాఫీపై సీఎం మాట‌ల‌న్నీ అబ‌ద్ధాలే: కేటీఆర్‌

BRS Working President KTR Criticizes CM Revanth Reddy

  • వంద శాతం రుణ‌మాఫీ పూర్తి చేశామ‌న్న సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లేన‌న్న కేటీఆర్‌
  • 20 ల‌క్ష‌ల మందికి రుణ‌మాఫీ కాలేదని మంత్రి తుమ్మ‌ల ప్ర‌క‌ట‌న‌
  • దీనిపై ఎక్స్ వేదిక‌గా స్పందించిన కేటీఆర్

రైతు రుణ‌మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలేనంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ 20 ల‌క్ష‌ల మందికి రుణ‌మాఫీ కాలేదని చెప్ప‌డంతో ముఖ్య‌మంత్రి బండారం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని తెలిపారు. ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ ఈ మేర‌కు పోస్ట్ చేశారు. 

వంద శాతం రుణ‌మాఫీ పూర్తి చేశామ‌న్న సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లేన‌ని ఇంకోసారి తేలిపోయింది. ఓ వైపు డిసెంబ‌ర్ 9న ఏక కాలంలో రుణ‌మాఫీ చేస్తామ‌ని మోసం చేసి.. మరోవైపు 10 నెల‌లైనా 20 ల‌క్ష‌ల మందికి అందించ‌కుండా ద‌గా చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. 

రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీ పూర్త‌యిపోయింద‌న్న సీఎం మాట‌లు ప‌చ్చి అబ‌ద్ధాలు అని విమ‌ర్శించారు. చేస్తామ‌న్న రుణ‌మాఫీ ఇప్ప‌టికీ పూర్తి చేయ‌లేద‌ని, ఇవ్వాల్సిన రైతుబందు సీజ‌న్ ముగిసినా ఇవ్వ‌లేదంటూ బీఆర్ఎస్ నేత మండిప‌డ్డారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 20 ల‌క్ష‌ల మంది రైతుల‌కు అన్యాయం జ‌రిగితే.. అనాధికారికంగా ఇంకా ఎంతమంది అన్న‌దాత‌లు ఉన్నారోన‌ని కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  


  • Loading...

More Telugu News