Dil Raju: అభిప్రాయాలు మారుతూ ఉంటాయి: దిల్ రాజు

dil raju speech at janaka aithe ganaka

  • 'జనక అయితే గనక' సినిమాపై నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
  • సుహాస్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల
  • నచ్చితే 'బలగం' సినిమాలా ప్రోత్సహించాలని కోరిన దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. సినిమా సక్సెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'వంద మందికి సినిమా నచ్చితే అది క్లాసిక్ అవుతుంది. 70 మందికి నచ్చితే సూపర్ హిట్, 50 మందికి నచ్చితే హిట్. అది సినిమా కాలిక్యులేషన్' అని అన్నారు. సుహాస్ హీరోగా దర్శకుడు సందీప్ బండ్ల తెరకెక్కించిన చిత్రం 'జనక అయితే గనక' మూవీ దసరా సందర్భంగా ఈ నెల 12న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియాకు ప్రివ్యూ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత దిల్ రాజు తెలిపారు.

నచ్చితే బలగం సినిమాలా దీనిని ప్రోత్సహించాలని, నచ్చకపోతే విడుదల వరకూ సైలెంట్ గా ఉండాలని సరదాగా పేర్కొన్నారు. తమ సినిమా 70 శాతం మందికి నచ్చుతుందని దిల్ రాజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు విడుదలైన తొలి రోజు చాలా మంది హంగామా చేస్తారన్నారు. రెండో రోజు వసూళ్లు చూసి తమకు నచ్చకపోయినా సినిమా హిట్ అయింది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారన్నారు. అభిప్రాయాలు మారుతూ ఉంటాయని దిల్ రాజు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News