Cabinet Meeting: కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు ఇవిగో!

Union cabinet meeting details

  • ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం
  • రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయం
  • మరో ఐదు ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదా

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వికసిత భారత్ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ భేటీ వివరాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు.

  • రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయం. 11.72 లక్షల మంది ఉద్యోగులకు రూ.2028.57 కోట్ల బోనస్.
  • చెన్నైమెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు ఆమోదం. రెండో దశలో రూ.63,246 కోట్లతో 119 కిలోమీటర్ల మే మెట్రో రైల్ ప్రాజెక్టు
  • చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టు మూడు కారిడార్లుగా విభజన... 120 స్టేషన్ల ఏర్పాటు. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలని లక్ష్యం.
  • వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎంఆర్కేవీవై), కృషోన్నతి యోజన (కేవై) పథకాలకు క్యాబినెట్ ఆమోదం.
  • రూ.1 లక్ష కోట్ల వ్యయంతో ఈ రెండు పథకాల అమలు. వ్యవసాయ రంగానికి సంబంధించిన 18 స్కీములను ఈ రెండు పథకాల పరిధిలోకి తీసుకువస్తారు.
  • నూనె గింజల ఉత్పత్తి 2030-31 నాటికి 69.7 టన్నులకు పెంచాలని నిర్ణయం
  • దేశంలో మరో ఐదు ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదా. బెంగాలీ, అస్సామీ, మరాఠీ, ప్రాకృత, పాళి భాషలకు ప్రాచీన హోదా.

  • Loading...

More Telugu News