Konda Surekha: సమంత విషయంలో నా మాటలు తప్పే కానీ...: కొండా సురేఖ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

Konda Surekha comments on Samantha issue

  • విడాకులకు కారణాలేమిటో ఎవరూ బయటకు చెప్పలేదన్న మంత్రి
  • నాగార్జున కుటుంబం లేదా సమంత కారణాలు వెల్లడించలేదన్న మంత్రి
  • పరిశ్రమ నుంచి వచ్చిన అంతర్గత సమాచారాన్నే చెప్పానన్న సురేఖ

నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల విడాకుల అంశంపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పే కావొచ్చని అన్నారు. కానీ నాగచైతన్య, సమత ఎందుకు విడిపోయారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని, విడాకులకు కారణంపై ఇటు నాగార్జున కుటుంబం లేదా అటు సమంత నుంచి ఎవరూ చెప్పలేదన్నారు. పరిశ్రమ నుంచి వచ్చిన అంతర్గత సమాచారాన్ని మాత్రమే తాను చెప్పానని, ఆ మాటలు తాను కోపంలో అన్నానని వెల్లడించారు.

తాను ఎప్పుడూ నిజాలే మాట్లాడుతానని, లోపల ఒకటి పెట్టుకొని బయట మరొకటి మాట్లాడే రకం కాదన్నారు. కేటీఆర్‌ను మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నారు. మళ్లీ ఇదే రిపీట్ అయితే కేటీఆర్‌ను హైదరాబాద్‌లోనే కాదు... జిల్లాల్లోనూ తిరగనివ్వబోమని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News