KTR: రాష్ట్ర ఆదాయం పడిపోతోంది... పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం: కేటీఆర్

KTR talks about Telangana revenue

  • పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్‌కు జత చేసిన కేటీఆర్
  • అనుభవరాహిత్యం వల్లే ప్రభుత్వ ఆదాయం పడిపోతోందన్న కేటీఆర్
  • సంపదను సృష్టించి పేదలకు పంచే తెలివి సీఎంకు లేకపోవడమే సమస్య అని వ్యాఖ్య
  • మార్పు మార్పు అంటూ కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శ

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం క్రమంగా పడిపోతోందని, పరిపాలనా వైఫల్యానికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 'తగ్గుతున్న సర్కార్ ఆమ్దానీ' పేరుతో 'వెలుగు' పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ తన ట్వీట్‌కు జత చేశారు. 

ప్రభుత్వ ఆదాయం పడిపోతోందని, అనుభవరాహిత్యంతోనే ఈ అనర్థమని పేర్కొన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచే తెలివి ఈ ముఖ్యమంత్రికి లేకపోవడమే సమస్య అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే ఈ దుస్థితి ఏర్పడితే రానున్న నాలుగేళ్లు మరింత కష్టమే అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప దిద్దుబాటు చర్యలు కనుచూపు మేర కూడా కనిపించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రగతి పథానికి పాతరేసిన పాపం... మార్పు మార్పు అంటూ మోసం చేసిన కాంగ్రెస్‌దే అంటూ తన ట్వీట్ ముగించారు.

KTR
Revanth Reddy
Telangana
Congress
  • Loading...

More Telugu News