Etela Rajender: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ సవాల్

Etala Rajendar Challenges Revanth Reddy

  • రేవంత్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
  • సీఎం మంచి పని చేస్తున్నారని అంటే ముక్కు నేలకు రాస్తానన్న ఈటల
  • ఎలాంటి భద్రత లేకుండా మూసీ ప్రాంతానికి వెళ్దామా? అని నిలదీత

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. సీఎం మంచి పని చేస్తున్నారని ప్రజలు మెచ్చుకుంటే ముక్కు నేలకు కూడా రాస్తానన్నారు. 

ఉప్పల్, రామంతాపూర్, అంబర్ పేట.... ఇలా ఎక్కడకు రమ్మని సీఎం చెప్పినా తాను సిద్ధమన్నారు. హరీశ్ రావు ఏదో రాసిస్తే తాను మాట్లాడుతానని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి భద్రత లేకుండా మూసీ పరీవాహక ప్రజల వద్దకు వెళదామా? అని నిలదీశారు.

Etela Rajender
Telangana
Revanth Reddy
BJP
  • Loading...

More Telugu News