Akash Deep: అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన ఇండియన్ పేసర్ ఆకాశ్ దీప్.. మనసు ప్రశాంతంగా ఉందన్న క్రికెటర్

Visits Ayodhya Ram Mandir And Says I am at Peace Now

  • ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచి వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పిన ఆకాశ్‌దీప్
  • ఇన్నాళ్లకు కుదిరిందన్న పేసర్
  • శ్రీరాముడిని తొలిసారి చూసినట్టు లేదని, ప్రతి రోజు చూసినట్టుగా ఉందన్న క్రికెటర్
  • అన్ని ఫార్మాట్లలోనూ భారత విజయం కొనసాగాలని రాముడిని కోరుకున్నట్టు చెప్పిన ఆకాశ్‌దీప్

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత జట్టు 2-0తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన రైజింగ్ ఇండియన్ క్రికెటర్, పేసర్ ఆకాశ్‌దీప్ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించాడు. ఇంగ్లండ్‌తో ఈ ఏడాది మొదట్లో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆకాశ్‌దీప్ తన తొలి రెండు ఓవర్లలోనే ముగ్గురు ఇంగ్లండ్ టాప్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

కాన్పూరులో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు అనంతరం ఆకాశ్‌దీప్ అయోధ్య ఆలయాన్ని సందర్శించాడు. శ్రీరాముడిని దర్శించుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని కానీ, మ్యాచ్‌ల వల్ల కుదరలేదని పేర్కొన్నాడు. అయినప్పటికీ రాముడి వీడియోలను చూశానని తెలిపాడు. తొలిసారి ఈ రోజు రాముడిని దర్శించుకున్నానని కానీ, ఇప్పుడే తొలిసారి చూసినట్టు ఏమీ అనిపించలేదని, ప్రతి రోజూ చూస్తున్న అనుభూతే కలిగిందని ఆకాశ్‌దీప్ పేర్కొన్నాడు. ఈ ఆలయంలోని రాముడి ఫొటోలను చూసినప్పుడే అది తన మదిలో నిలిచిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తనకు ప్రశాంతంగా ఉందని వివరించాడు. 

తాను ఏదో కావాలని ఆలయాలను దర్శించుకునే అలవాటు లేదని చెప్పాడు. అయితే, ఈసారి మాత్రం అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టు విజయం సాధించేలా చూడాలని రాముడిని వేడుకున్నట్టు తెలిపాడు.  అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ క్రికెట్‌ను మనం శాసించడం స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తు తరాలు కూడా దీనిని కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News