Pawan Kalyan: స‌నాత‌న ధ‌ర్మాన్ని గౌర‌వించే నా గ‌ద్ద‌ర‌న్న‌కి న‌మ‌స్సుమాంజ‌లి: డిప్యూటీ సీఎం ప‌వ‌న్

AP Deputy CM Pawan Kalyan Special Tweet on Gaddar


ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జా యుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్‌ను గుర్తుచేసుకుంటూ ఓ పాత వీడియోను ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పంచుకున్నారు. "ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నని స్మరించుకుంటూ... సనాతన ధర్మాన్ని గౌరవించే నా గద్దరన్నకి నమస్సుమాంజలి.." అని ట్వీట్ చేశారు. దీనికి ఓ పాత వీడియోను జోడించారు. అలాగే యాదాద్రి ఆల‌యం ఎదుట గ‌ద్ద‌ర్ మోక‌రిల్లి వంద‌నం చేసిన‌, ఆసుప‌త్రిలో చేరిన గ‌ద్ద‌ర్‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించి హ‌త్తుకున్న ఫొటోల‌ను జ‌న‌సేనాని పంచుకున్నారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

More Telugu News