Sonbhadra Horror: ఉత్తరప్రదేశ్‌లో అమానవీయం.. గిరిజన యువకుడిపై దాడిచేసి.. నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు

Miscreants Brutally Beat Tribal Youth Urinate On His Head  Face In UPs Sonbhadra

  • ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఘటన
  • యువకుడిని చుట్టుముట్టి తన్నుతూ చిత్రహింసలు
  • ఆపై నోట్లో మూత్రం పోసి వికృతానందం
  • నిందితుల్లో ఒకడి అరెస్ట్.. మిగతా వారి కోసం గాలింపు

ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్రలో అమానవీయం జరిగింది. ఓ గిరిజన యువకుడిపై దాడిచేసిన కొందరు యువకులు అతడి తలపైనా, ముఖంపైనా, నోట్లోనూ మూత్రం పోసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. యువకుడిని కొడుతూ, తన్నుతూ దారుణంగా హింసించిన దుండగులు ఆపై మూత్రం పోశారు. 

ఈ వీడియోను షేర్ చేసిన బాధిత యువకుడి సోదరుడు శివకుమార్ ఖర్వార్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డీజీపీని ట్యాగ్ చేశాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడు పవన్ ఖర్వార్‌పై దాడిచేసిన అంకిత్, మరో ఏడుగురు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. సెప్టెంబర్ 26న రాత్రి 8 గంటల ప్రాంతంలో శక్తినగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది.

బాధితుడు పవన్‌ను చుట్టుముట్టి దాడిచేసిన యువకులు చితకబాదారు. ఆపై వారిలో ఒకడు బాధితుడిపై మూత్రం పోశాడు. తనను వదిలేయాని పవన్ వేడుకోవడం ఆ వీడియోలో వినిపించింది. అతడి అభ్యర్థనను ఏమాత్రం పట్టించుకోని నిందితులు అతడిపై మూత్రం పోస్తూ ఆ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు అంకిత్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఇలాంటి ఘటన జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి.

More Telugu News