KTR: ముదురుతున్న వివాదం.. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

KTR sends legal notice to Konda Surekha

  • హీరోయిన్లను ఉద్దేశిస్తూ కేటీఆర్ పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు
  • తన గౌరవానికి భంగం కలిగించేలా సురేఖ అబద్ధాలు మాట్లాడారన్న కేటీఆర్
  • క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక

హీరోయిన్లను ఉద్దేశిస్తూ తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సాక్ష్యాలు లేకుండా అసత్యాలు మాట్లాడారని దుయ్యబట్టారు. 

గతంలో కూడా తన గురించి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని... ఆ వ్యాఖ్యలపై ఏప్రిల్ లో నోటీసులు పంపించానని కేటీఆర్ చెప్పారు. చట్ట పరంగా తాను స్పందించకుంటే... ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రజలు భావించే ప్రమాదం ఉందని అన్నారు. తనకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని... లేకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని హెచ్చరించారు.

కేటీఆర్ వల్ల కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డారని... కొందరు త్వరగా పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారని కొండా సురేఖ అన్నారు. నాగార్జున కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలకు... సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.

KTR
BRS
Konda Surekha
Congress
Legal Notice
  • Loading...

More Telugu News