Rajanikanth: రజనీ విశ్వరూపమే 'వేట్టయన్' .. ట్రైలర్ రిలీజ్!

Vettaiyan Movie Update

  • యాక్షన్ డ్రామాగా రూపొందిన 'వేట్టయన్'
  • లైకా వారి మరో భారీ ప్రాజెక్టుగా క్రేజ్ 
  • జ్ఞానవేల్ నుంచి వస్తున్న సినిమా
  • భారీ తారాగణమే ప్రత్యేక ఆకర్షణ 

రజనీకాంత్ అభిమానులంతా ఇప్పుడు 'వేట్టయన్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

నేరస్తులు .. కోర్టులు .. పోలీసుల నేపథ్యంలో సాగే సన్నివేశాలను ట్రైలర్ లో ఎక్కువగా టచ్ చేశారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన అమితాబ్ .. ఫహాద్ ఫాజిల్ .. రానా .. రావు రమేశ్ .. రితికా సింగ్ .. మంజు వారియర్ .. అభిరామి పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ వదిలారు. రజనీ మార్క్ డైలాగ్స్ తో .. ఫైట్లతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

యథార్థ సంఘటన నేపథ్యంతో అల్లుకున్న కథ ఇది అనే టాక్ ఉంది. సామాజికపరమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. 'జైలర్' కథకు పూర్తి భిన్నంగా ఉంటుందని, రజనీ ఇమేజ్ కి దూరంగా అనిపిస్తుందని చెబుతున్నారు. దాంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News