Chiranjeevi: పవర్ఫుల్ కళ్లతో పడగొట్టే స్టార్స్!

Special

  • కరెంటు కళ్లతో కట్టిపడేసే మెగాస్టార్
  • ఆ చూపుల్లోని పవర్ కి ఫ్యాన్స్ ఎక్కువ 
  • జగపతిబాబులో ప్రధానమైన ఆకర్షణ కళ్లు 
  • ఆయన విలనిజంలో విరుగుడు లేని పాత్ర
  • ఆ తరువాత స్థానాల్లో సముద్రఖని .. అజయ్ ఘోష్  


తెలుగు తెరపై చాలామంది స్టార్స్ గా వెలుగొందుతున్నారు. ఏ నటుడైనా తెరపై నిలదొక్కుకున్నాడు, అతనిని లక్షల మంది ప్రేక్షకులు అభిమానిస్తూ ఉన్నారంటే వాళ్లలో ఏదో ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఆ ప్రత్యేకతనే వాళ్లకి అభిమానుల హృదయాలలో చోటు దక్కడానికి ప్రధానమైన కారణమైందని అనుకోవాలి. అలా తెరను ఏలుతున్న స్టార్స్ లో పవర్ ఫుల్ కళ్లతో .. చూపులతో పడగొట్టినవారు కొంతమంది కనిపిస్తారు. 

అలా పవర్ఫుల్ కళ్లను కలిగిన స్టార్స్ లో ముందుగా చిరంజీవి కనిపిస్తారు. చిరంజీవి కళ్లు కరెంటును దాచుకున్నట్టుగా ఉంటాయి. ఆదేశిస్తున్నట్టుగా .. శాసిస్తున్నట్టుగా అనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ లో ఆయన ఎక్కువ మార్కులు కొట్టేయడంలో ఆయన కళ్లు ప్రధానమైన పాత్రను పోషించాయి. ఆ తరువాత జగపతిబాబు కళ్లను గురించి చెప్పుకోవచ్చు. జగపతిబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే, ఆయన కళ్లలో గల పవర్ కారణంగా ఆయన విలన్ గా కూడా రాణిస్తారని అనుకున్నారు. అలాగే ఆయన స్టార్ హీరోగానే కాదు, స్టార్ విలన్ గా కూడా ఎదిగారు. 

ఇక ఇప్పుడున్న విలన్స్ లో సముద్రఖని కళ్లు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. విలన్ గా ఆయన ఇంతవరకూ చేసిన పాత్రలకు డైలాగ్స్ ఉన్నది చాలా తక్కువ. కంటి చూపుతోనే ఆయన కావాల్సినంత విలనిజాన్ని పండిస్తూ ఉంటాడు. ఆ తరువాత స్థానంలో మనం అజయ్ ఘోష్ పేరును చెప్పుకోవచ్చు. ఆ కళ్లు చూపులతోనే ఎదుటివారిని చదివేస్తున్నట్టుగా .. చంపేస్తున్నట్టుగా ఉంటాయి. ఇలా కళ్లతోనే అభిమానుల కళ్లను కట్టిపడేసే స్టార్స్ మరికొందరు ఉంటారేమో. 

Chiranjeevi
Jagapathi Babu
Samudrakhani
Ajay Ghosh
  • Loading...

More Telugu News