Dhruva: పొలిమేర దాటితే అంతే .. 'ఆహా'లో హారర్ థ్రిల్లర్ 'కళింగ'

Kalinga OTT Release Date Confirmed

  • సెప్టెంబర్ 13న విడుదలైన 'కళింగ' 
  • హీరో, హీరోయిన్స్ గా ధ్రువ - ప్రగ్యా నయన్  
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • రేపటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్


'ఆహా' ఓటీటీ తెరపైకి 'కళింగ' సినిమా రావడానికి రెడీ అవుతోంది. రేపటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ధ్రువ వాయు దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. ధ్రువ వాయు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ప్రగ్యా నయన్ కథానాయికగా కనిపిస్తుంది. 

సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ ఇది. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకేత్తించిన ఈ సినిమా, ఓటీటీ వైపుకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి ఈ సినిమా, ఈ నెల 4వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. విష్ణు శేఖర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ఆడుకాలం నరేన్ .. తనికెళ్ల భరణి .. మురళీధర్ గౌడ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

కథలోకి వెళితే .. అది 'కళింగ' అనే ఊరు. ఆ ఊరును ఆనుకుని దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక పాడుబడిన సంస్థానం ఉంటుంది. కళింగ రాజాకి సంబంధించిన నిధి అందులో ఉందనేది అందరి నమ్మకం. అయితే ఆ నిధికి కాపలాగా ఒక దుష్టశక్తి ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న కథానాయకుడు, ఆ సంస్థానానికి వెళ్లవలసి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.

  • Loading...

More Telugu News