CM Chandrababu: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం చంద్ర‌బాబు గుడ్‌న్యూస్‌

Garbage Tax Cancelled From Today Says AP CM Chandrababu Naidu

  • నేటి నుంచి రాష్ట్ర‌ వ్యాప్తంగా చెత్త ప‌న్ను రద్దు
  • ఎక్క‌డా చెత్త ప‌న్ను వ‌సూలు చేయొద్ద‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం
  • మ‌చిలీప‌ట్నంలో స్వ‌చ్ఛ‌తా హీ సేవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు

ఏపీ ప్ర‌జ‌ల‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా చెత్త ప‌న్ను రద్దు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు అధికారుల‌ను ఎక్క‌డా ప్ర‌జ‌ల నుంచి చెత్త ప‌న్ను వ‌సూలు చేయ‌రాద‌ని ఆదేశించారు. 

కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఇక్క‌డ నిర్వ‌హించిన స్వ‌చ్ఛ‌తా హీ సేవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ... "రాష్ట్రంలో 2019లో వచ్చిన వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల‌ను అస్త‌వ్య‌స్తం చేసింది. రోడ్ల‌పై 85 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల చెత్త పేరుకుపోయింది. ఏడాది లోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించాల‌ని మంత్రి నారాయ‌ణ‌ను ఆదేశించాం. 2029 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవాలి.

ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కార‌ణం స్వ‌చ్ఛ సేవ‌కులే. ప్ర‌తి ఒక్క‌రూ స్వ‌చ్ఛ సేవ‌కులు కావాలి. కొంద‌రు స్వార్థప‌రులు ఆంధ్ర జాతీయ క‌ళాశాల‌ను ఆక్ర‌మించారు. స‌ర్కార్ దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. జాతీయ ప‌తాకం రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య పేరు మీద వైద్య క‌ళాశాల ఏర్పాటు చేస్తాం.

అక్టోబ‌ర్ 2, 2014లో స్వ‌చ్ఛ భార‌త్‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వీకారం చుట్టారు. ఇది ఎంతో గొప్ప కార్య‌క్ర‌మం. దీనికి అంద‌రం ప్ర‌ధానికి అభినంద‌నలు తెలియ‌జేయాలి. మ‌న ప‌రిస‌రాలు శుభ్రంగా ఉంటేనే... మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. బాపూజీ స్ఫూర్తితోనే స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం తీసుకురావ‌డం జ‌రిగింది.  

నీతి ఆయోగ్‌లో స్వ‌చ్ఛ భార‌త్‌పై ఉప‌సంఘం ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్మ‌న్‌గా ఉన్నాను. 2 ల‌క్ష‌లకు పైగా వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణంతో ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చాం. చెత్త నుంచి సంప‌ద సృష్టించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాను" అని చంద్ర‌బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News