: నెహ్రూ, గాంధీలపై యూపీఏ ప్రకటనల ఖర్చు 53కోట్లు
జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ.. ఈ ముగ్గురు నేతల స్మారక దినాల(జయంతి, వర్థంతి)ల సందర్భంగా యూపీఏ2 సర్కారు ఈ నాలుగేళ్ల కాలంలో 53 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ధారపోసింది. మాజీ నేతల స్మారక దినాల సందర్భంగా పత్రికల్లో ప్రకటనల కోసం 142కోట్ల రూపాయలు వెచ్చించగా.. అందులో నెహ్రూ, ఇందిర, రాజీవ్ ల కోసమే 53 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.