Babar Azam: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజం కీలక ప్రకటన

Babar Azam has stepped down as the captain of Pakistan team effective immediately in white ball cricket

  • పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటన
  • భారాన్ని తగ్గించుకొని వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి పెడతానన్న బాబర్
  • తన నిర్ణయాన్ని పీసీబీ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు కూడా తెలియజేసినట్టు ఎక్స్ వేదికగా ప్రకటన

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం కీలక ప్రకటన చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని గత నెలలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. కెప్టెన్సీ చక్కటి అనుభవమని, అయితే తనపై ప్రతికూల ప్రభావం పడుతోందని బాబర్ చెప్పాడు. కెప్టెన్‌గా వైదొలగి తన ప్రదర్శనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు అతడు వివరించాడు.

‘‘ పాక్ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకొని నా వ్యక్తిగత పాత్రపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్సీ అనేది ఒక చక్కటి అనుభవం. అయితే భారాన్ని పెంచింది. నా ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నాను. నా కుటుంబంతో మంచిగా సమయం గడపాలని భావిస్తున్నాను. ఈ విషయాలు నాకు ఆనందం కలిగిస్తాయి’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో బాబర్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో బాబర్‌ను కెప్టెన్‌గా పీసీబీ నియమించింది. ఆ తర్వాత 4 టీ20 సిరీస్‌లకు నాయకత్వం వహించాడు. ఇక బాబర్ 85 టీ20 మ్యాచ్‌ల్లో పాక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 48 విజయాలతో పాక్ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్‌గా నిలిచాడు. ఇక బాబర్ ఆధ్వర్యంలో పాక్ 43 వన్డే మ్యాచ్‌లు ఆడగా అందులో 26 మ్యాచ్‌లను గెలుచుకుంది.

  • Loading...

More Telugu News