Pawan Kalyan: తిరుమల చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan arrives Tirumala

  • ఇటీవల తెరపైకి లడ్డూ కల్తీ వ్యవహారం
  • ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
  • రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమణ

ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు తిరుమల విచ్చేశారు. ఈ సాయంత్రం తిరుపతిలోని అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా పవన్ కల్యాణ్ కాలినడకన తిరుమల చేరుకున్నారు. పవన్ కు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. పవన్ కల్యాణ్ వెంట జనసేన నేతలు, అభిమానులు భారీగా తిరుమల తరలిరావడంతో కోలాహలం నెలకొంది. 

కాగా, పవన్ కల్యాణ్ ఈ రాత్రికి తిరుమలలోని గాయత్రీ నిలయం గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఆయన రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. పవన్ రేపు కూడా తిరుమలలోనే ఉంటారని తెలుస్తోంది.

More Telugu News