Anjana Devi: మెగా మాతృమూర్తి అంజనా దేవి స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో ఇదిగో!

Anjana Devi interview promo released

  • జనసేన పార్టీ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అంజనాదేవి
  • తన ముగ్గురు కుమారుల సంగతులు వెల్లడి
  • ముఖ్యంగా పవన్ కల్యాణ్ గురించి చెప్పిన వైనం

మెగా మాతృమూర్తి అంజనాదేవి జనసేన పార్టీ యూట్యూబ్ చానల్ కు 'అమ్మ మనసు' పేరిట ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన కుమారులు చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుల గురించి అనేక అంశాలను పంచుకున్నారు. 

ముఖ్యంగా, తన చిన్న కుమారుడు పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ కు పట్టుదల ఎక్కువని, ఇది చేయాలి అనుకుంటే చేసేవాడని అంజనాదేవి వెల్లడించారు. ఏపీలో పరిణామాల కారణంగా పవన్ రోడ్డుపై పడుకున్న దృశ్యాలు చూశాక చాలా బాధ కలిగిందని చెప్పారు. పవన్ అన్నప్రాసన సంగతులను కూడా అంజనాదేవి వివరించారు. 

కాగా, ఈ ఇంటర్వ్యూ ప్రోమో నేడు విడుదలైంది. త్వరలోనే జనసేన పార్టీ యూట్యూబ్ చానల్లో ఇంటర్వ్యూ పూర్తి వీడియో విడుదల కానుంది.

Anjana Devi
Interview
Promo
Pawan Kalyan
Chiranjeevi
Nagababu
Janasena

More Telugu News