Rajinikanth: నా మిత్రుడు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: సీఎం చంద్రబాబు

CM Chandrababu wishes Rajinikanth a speedy recovery

  • రజనీకాంత్ కు అస్వస్థత
  • స్టెంట్ అమర్చిన వైద్యులు
  • సోషల్ మీడియాలో స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు వైద్యులు స్టెంట్ వేయడం తెలిసిందే. రజనీకాంత్ నిన్న అస్వస్థతకు గురికాగా, ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం వాపుకు గురైనట్టు వైద్యులు గుర్తించి, స్టెంట్ అమర్చారు. రజనీ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. "నా మిత్రుడు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన ఆరోగ్యం కోసం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నాను"  అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

కాగా, రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, మరో రెండ్రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేస్తామని అపోలో వైద్యులు వెల్లడించారు.

More Telugu News