Sonia: అలా అనుకుంటే నేనేం చేయలేను: బిగ్ బాస్ సోనియా!

Sonia Interview

  • తానెవరినీ ప్రభావితం చేయలేదన్న సోనియా 
  • పృథ్వీ .. నిఖిల్ ఎవరి మాటా వినరని వ్యాఖ్య
  • విష్ణుప్రియను తాను టార్గెట్ చేయలేదని వెల్లడి 
  • తాను సరిగ్గా ఆడలేదనేది నిజం కాదన్న సోనియా


బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పుడిప్పుడే వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే సోనియా బయటికి వచ్చేసింది. క్రితం వారం ఎలిమినేషన్ చివరిలో మణికంఠ - సోనియా ఇద్దరే మిగిలారు. వాళ్లలో ఇటు ఆడియన్స్ .. అటు బిగ్ బాస్ హౌస్ అభిప్రాయం అంటూ సోనియా ఎలిమినేషన్ ను ప్రకటించారు. దాంతో ఆమె హౌస్ లోని సభ్యుల పట్ల తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ బయటకి వచ్చేసింది. 

'స్టార్ మా మ్యూజిక్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడింది. "హౌస్ లో నాకు పృథ్వీ .. నిఖిల్ .. అభయ్ లతో ఎక్కువ బాండింగ్ ఉండేది. వాళ్లను నా ఫ్రెండ్స్ గానే భావిస్తూ వచ్చాను. నేను పృథ్వీ ఆటతీరును ప్రభావితం చేశానని అనడంలో నిజం లేదు. అలాగే వాళ్లిద్దరినీ ఆయుధాలుగా ఉపయోగించానని అనడం కూడా కరెక్టు కాదు. ఎందుకంటే వాళ్లు ఎవరు చెప్పినా మారరు .. తమకు తోచినట్టుగానే ఆడతారు" అని అంది.

"నబీల్ పట్ల నాకు మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఆయన మాటలు హర్ట్ చేయడం వలన నేను నామినేట్ చేయవలసి వచ్చింది. ఇక విష్ణుప్రియ తనకి నచ్చినవారిపట్ల ఎంత మంచిగా ఉంటుందో .. నచ్చనివారి పట్ల అంతే ఇదిగా ఉంటుంది. ఆమె మాటలు నచ్చకపోవడం వలన నేను దూరంగా ఉంటూ వచ్చాను. నా స్థాయిలో నేను ఆడాను .. పోరాడాను .. నమ్మకపోతే నేనేం చేయలేను" అని చెప్పింది.

Sonia
Nikhil
Pruthvi
Vishnu Priya
Bigg Boss 8
  • Loading...

More Telugu News