Rajinikanth: రజనీకాంత్ కు స్టెంట్ వేసిన వైద్యులు

Rajinikanth health stable

  • అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
  • ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
  • ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలింపు

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి. 

మరోవైపు రజనీ భార్య లత స్పందిస్తూ... రజనీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. రజనీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. చాలా మంది అభిమానులు ఆసుపత్రి వద్దకు కూడా చేరుకున్నారు. కొన్ని గంటల సేపు ఐసీయూలో ఉన్న రజనీని... వైద్యులు ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు.

రజనీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన చెన్నై అపోలో  వైద్యులు

గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వెల్లడించారు. కాగా, రజనీకాంత్ కు నాన్ సర్జికల్, ట్రాన్స్ క్యాథెటర్ విధానంలో చికిత్స అందించినట్టు ఆ బులెటిన్ లో తెలిపారు. వాపు వచ్చిన రక్తనాళంలో స్టెంట్ అమర్చినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News