Atishi: పోలీస్ స్టేషన్‌లో వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన అతిశీ... అడ్డుకున్న పోలీసులు

Delhi CM Atishi denied meeting with climate activist Sonam Wangchuk

  • పలు డిమాండ్లతో గత నెల 1 నుంచి పాదయాత్ర చేస్తున్న వాంగ్‌చుక్
  • వాంగ్‌చుక్‌ను, పలువురు అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వాంగ్‌చుక్‌ను కలిసేందుకు బవానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సీఎం అతిశీ

పోలీసుల అదుపులో ఉన్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సీఎంను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సోనమ్ వాంగ్‌చుక్, ఆయన మద్దతుదారులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గత నెల 1న లేహ్‌లో పాదయాత్రను ప్రారంభించారు. లఢక్‌ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక జనాభా, వారి భూమి, సాంస్కృతిక గుర్తింపును రక్షించడానికి ఇది చట్టాన్ని రూపొందించే అధికారం ఇస్తుందని అంటున్నారు. 

ఈ డిమాండ్లతో పాదయాత్ర ప్రారంభించిన సోమ్ వాంగ్‌చుక్‌ను, పలువురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వాంగ్‌చుక్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి అతిశీ బవానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ ఆమెను పోలీసులు అడ్డుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News