KTR: మీ తాట తీయడానికే వచ్చా: కాన్వాయ్‌పై దాడి జరిగిందంటూ కేటీఆర్ ఆగ్రహం
- ప్రజలకు అండగా ఉండే తమను ముఖ్యమంత్రి ఆపలేరన్న కేటీఆర్
- ఏ బుల్డోజర్లూ తమ గొంతును ఆపలేవన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- తమది ఉద్యమాల పిడికిలి అన్న కేటీఆర్
తన కాన్వాయ్‌పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయని, కానీ వారి తాటాకు చప్పుళ్లకు తాను భయపడేవాడిని కాదని, తాట తీయడానికే వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంతకుముందు, అంబర్ పేటలో కేటీఆర్ కాన్వాయ్‌ను యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ... ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ పిల్లి కూతలకు ఎవరూ భయపడరన్నారు.
ప్రజలకు అండగా ఉంటామని, దీనిని సీఎం రేవంత్ రెడ్డి ఆపలేరన్నారు. ఏ బుల్డోజర్లు తమ గొంతును ఆపలేవని వ్యాఖ్యానించారు. నీ గూండా రాజ్యాన్ని సవాలు చేసే నా స్ఫూర్తిని ఏ గూండాలు అడ్డుకోలేరని హెచ్చరించారు. వాహనంపై గూండాలు చేసిన దాడితో తన సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప వెనక్కి తగ్గేది లేదన్నారు. తమది ఉద్యమాల పిడికిలి అని గుర్తుంచుకోవాలన్నారు.