KA Paul: తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేఏ పాల్ పిటిషన్

KA Paul files petition in Supreme Court requesting to make Tirupati as Union Territory

  • తిరుమల లడ్డూపై సీబీఐ విచారణ జరిపించాలన్న కేఏ పాల్
  • చంద్రబాబు, పవన్ శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని విమర్శ
  • వీరు తిరుమల లడ్డూ గురించి మాట్లాడకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరానన్న పాల్

కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేవలం 744 మంది క్యాథలిక్స్ ఉండే వాటికన్ సిటీ ప్రత్యేక దేశంగా ఉందని... కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. 

100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని పాల్ విమర్శించారు. లడ్డూ నాణ్యతపై జూలై నెలలో ల్యాబ్ రిపోర్ట్ వస్తే... దాని గురించి సెప్టెంబర్ లో మాట్లాడటమేమిటని ప్రశ్నించారు.
 
లడ్డూ వ్యవహారంపై సుప్రంకోర్టులో జరుగుతున్న విచారణలో మధ్యంతర ఉత్తర్వులను కోరుతూ పిటిషన్ వేశానని కేఏ పాల్ తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరు లడ్డూ గురించి మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్ లో కోరానని వెల్లడించారు. లడ్డూలో కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని... భక్తుల్లో గందగోళం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News